విద్యాశాఖలో అమలు చేయాల్సిన నిర్ణయాలను కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయొద్దని... యుద్ధ ప్రతిపాదికన కేసుల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖకు సంబంధించి కోర్టులో పెండింగ్ ఉన్న కేసులపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
కోర్టు కేసులపై దృష్టిసారించండి: విద్యాశాఖ మంత్రి సురేశ్ - minister suresh review on DSC news
విద్యాశాఖకు సంబంధించి కోర్టులో పెండింగ్ ఉన్న కేసులపై... సచివాలయంలో మంత్రి సురేశ్ అధికారులతో సమీక్షించారు. విచారణలో ఉన్న కేసులపై దృష్టిసారించాలని... త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు కృషి చేయాలని సూచించారు.
minister suresh review on court cases related to the eduaction ministry
కేసుల పేరుతో కాలయాపన చేస్తూ... కొన్ని సమస్యలను అలాగే పెండింగ్‌లో ఉంచటం సరికాదన్నారు. ముఖ్యంగా డీఎస్సీ, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన ఫైల్స్‌పై తక్షణమే దృష్టి సారించాలన్నారు. ప్రతినెలా కోర్టు కేసులపై సమీక్షించి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వపరంగా కావలసిన సహకారం అందిస్తామని హామీఇచ్చారు.
ఇదీ చదవండి : భాజపా బలపడుతోంది... అందుకే...!