ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటించాలి: మంత్రి సురేశ్

మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించిన అంశాలపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్ష నిర్వహించారు. డ్రై రేషన్ లో భాగంగా బియ్యంతో పాటు కోడిగుడ్లు సక్రమంగా పంపిణీ జరుగుతున్నాయో లేదో పరిశీలించాలని అధికారులకు సూచించారు.

mid day meal programme
mid day meal programme

By

Published : Aug 10, 2020, 7:38 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్ష నిర్వహించారు. జగనన్న గోరు ముద్దగా అమలు అవుతున్న ఈ పథకంలో మెనూ తో పాటు టెండర్ల పరిస్థితి, డ్రై రేషన్ పంపిణీ తదితర అంశాలపై మంత్రి చర్చించారు.

చిక్కీ, కోడి గుడ్ల నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. బియ్యంతో పాటు కోడిగుడ్లు సక్రమంగా పంపిణీ జరుగుతున్నాయో లేదో పరిశీలించాలని అధికారులకు సూచించారు. డ్రై రేషన్ పంపిణీ లో భాగంగా మొదటి దశలో మార్చి 19 నుంచి 31 వరకు 95 శాతం పంపిణీ చేశామని అధికారులు చెప్పారు.

రెండో దశలో ఏప్రిల్ 1 నుంచి 23 వరకు 94 శాతం, మూడో దశలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు 83 శాతం డ్రై రేషన్ పంపిణీ చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు. వంద శాతం లబ్ధిదారులకు డ్రై రేషన్ ఎందుకు అందలేదో క్షేత్ర స్థాయిలో అధికారుల ద్వారా తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:

నూతన పారిశ్రామిక విధానం...సింగిల్ విండో ద్వారా అనుమతులు

ABOUT THE AUTHOR

...view details