ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి బాలినేని సవాలు స్వీకరించేందుకు తెదేపా సిద్ధమా?: మంత్రి సురేష్ - మంత్రి ఆదిమూలపు సురేశ్ లేటెస్టు న్యూస్

మంత్రి బాలినేని కారులో నగదు పట్టుబడిందంటూ తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఆరోపణలు నిరూపించాలని లేకపోతే బాలినేనికి క్షమాపణలు చెప్పాలన్నారు.

minister Suresh
మంత్రి బాలినేని సవాలు స్వీకరించేందుకు తెదేపా సిద్ధమా?: మంత్రి సురేష్

By

Published : Jul 17, 2020, 5:23 PM IST

మంత్రి బాలినేనిపై తెదేపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కారులో పట్టుబడిన నగదుపై వ్యాపారి వివరణ ఇచ్చినా ఆరోపణలు అర్ధరహితమన్నారు. మంత్రి బాలినేని సవాలు స్వీకరించేందుకు తెదేపా సిద్ధమా అని సవాలు విసిరారు. ఆరోపణలు నిరూపించలేని తెదేపా నేతలు బాలినేనికి క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారులో తరలిస్తున్న రూ.5.27 కోట్లను తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒంగోలుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేయగా... ఆ వాహనంపై మంత్రి బాలినేని పేరిట స్టిక్కర్‌ ఉండటం కలకలం రేపింది. ఈ నగదు పట్టుబడిన ఘటనపై ఈడీ దర్యాప్తు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. మంత్రి వర్గం నుంచి బాలినేనిని బర్తరఫ్ చేయాలని కోరారు.

ఇవీ చూడండి- ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో రూ.5.27 కోట్ల నగదు

ఇవీ చూడండి- -'పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదే... మంత్రికి ఏ సంబంధమూ లేదు'

ABOUT THE AUTHOR

...view details