ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Primary Schools: ప్రాథమిక పాఠశాలలు మూతపడవు: మంత్రి సురేష్‌

By

Published : Jan 30, 2022, 8:55 AM IST

3, 4, 5 తరగతులను విలీనం చేయడం వల్ల ప్రాథమిక బడులు మూతపడవని మంత్రి సురేష్‌ వెల్లడించారు. విద్యార్థులు మాత్రమే మరో బడికి మారతారని తెలిపారు.

minister suresh on primary schools
minister suresh on primary schools

ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేయడం వల్ల ప్రాథమిక బడులు మూతపడవని మంత్రి సురేష్‌ వెల్లడించారు. విద్యార్థులు మాత్రమే మరో బడికి మారతారని తెలిపారు. పాఠశాలల మ్యాపింగ్‌పై సచివాలయంలో నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘మ్యాపింగ్‌ ద్వారా పాఠశాలలు రద్దు కావు. ఇప్పుడున్న బడులు 6 రకాలుగా మారతాయి. మ్యాపింగ్‌ తర్వాత ఎన్ని అదనపు తరగతి గదులు అవసరమవుతాయో గుర్తిస్తాం. ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని అవరోధాలు వచ్చినా ఐదు నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నాం. కొవిడ్‌ భయంతో పాఠశాలలను మూసివేసిన పొరుగు రాష్ట్రాలు తిరిగి తెరుస్తున్నాయి’’ అని తెలిపారు. ‘‘అతి తక్కువగా ఉండే ఉర్దూ పాఠశాలలను మ్యాపింగ్‌ చేసే విషయంలో పునరాలోచించాలి’’ అని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కోరారు.

ABOUT THE AUTHOR

...view details