ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవు... పరీక్షలు యథాతథం' - పాఠశాలకు సెలవులపై మంత్రి ఆదిమూలపు సురేశ్​

కరోనా వ్యాప్తి దృష్ట్యా... ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 31 తర్వాత మళ్లీ సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

minister suresh on holidays to schools
పాఠశాల సెలవులపై ఆదిమూలపు సురేశ్​

By

Published : Mar 19, 2020, 11:56 AM IST

Updated : Mar 19, 2020, 12:13 PM IST

విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

కరోనా దృష్ట్యా రాష్ట్రంలో ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సంస్థలు, వైద్య, నర్సింగ్ కళాశాలలకు సెలవులిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలలకూ ఈ జీవో వర్తిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ నెల 31 తర్వాత మళ్లీ సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

పది పరీక్షల యథావిధిగా

పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి యథావిధిగా జరుగుతాయని మంత్రి వెల్లడించారు. ఈనెల 23 వరకూ ఇంటర్​ పరీక్షలూ యథాతథంగానే జరుతాయని చెప్పారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సెలవుల దృష్ట్యా విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

40 గంటలు నిద్రాహారాలు లేక మనీలాలోనే

Last Updated : Mar 19, 2020, 12:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details