ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్స్పై రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్( minister suresh) వెల్లడించారు. కోర్టు గత సంవత్సరం కూడా స్టే ఇచ్చిందన్న మంత్రి.. దానికి సంబంధించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని, ఈ విషయాలు అన్నీ కోర్టుకు తెలియ చేస్తామని తెలిపారు. విద్యాసంవత్సరం వృథా కాకుండా అడ్మిషన్లు ఆన్లైనా? ఆఫ్లైనా? అనేది నిర్ణయిస్తామన్నారు. విద్యార్థుల తల్లి అకౌంట్లో పడ్డ ఫీజు చెల్లించకపోతే.. కాలేజీ యాజమాన్యానికి కారణం తెలియచేయాలని సూచించారు. అలాంటి వారికి రీయింబర్స్‌మెంట్ నిలుపుదల విషయం పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు.
minister suresh: 'రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు నిర్ణయం' - ఆదిమూలపు సురేశ్ ఇంటర్ అడ్మిషన్స్
ఇంటర్ అడ్మిషన్స్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్( minister suresh) వెల్లడించారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు.

minister suresh on fee reimbursement