పవన్ కల్యాణ్ రాష్ట్రానికే గుదిబండగా తయారయ్యారని మంత్రి సురేశ్ విమర్శించారు. పవన్ అప్పుడప్పుడు వచ్చి కులాలను రెచ్చగొట్టి వెళ్తారని ఆరోపించారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది పద్ధతి కాదని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు. తెదేపా భావజాలంలోనే పవన్ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలొస్తే ఏదో ఒక అలజడి సృష్టించాలన్నదే పవన్ ధోరణి అని మంత్రి సురేశ్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ సినిమాలకు కాల్ షీట్స్ లేకపోతేనే ప్రజల్లోకి వస్తారని మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. ప్రజలందరూ సంతోషంగా జీవిస్తూ ఏ రాజకీయ పార్టీల వైపు చూడడం లేదని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణ సరిగా లేదన్న మంత్రి.. వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మlతులు చేపట్టనున్నట్లు తెలిపారు.