ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేసులు పరిష్కారమయ్యాకే డీఎస్సీ నోటిఫికేషన్' - త్వరలో ఏపీ టెట్ వార్తలు

ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి... కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారమయ్యాకే డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. త్వరలోనే టెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

minister suresh comments on DSC notification

By

Published : Nov 19, 2019, 11:13 PM IST

'కేసులు పరిష్కారమయ్యాకే డీఎస్సీ నోటిఫికేషన్'

ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి... న్యాయస్థానాల్లో ఉన్న కేసులు పరిష్కారమయ్యాకే డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని... విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. డీఎస్సీ 2018 సహా అంతకు ముందు నిర్వహించిన పలు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని.. వాటన్నింటినీ సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కేసులు పరిష్కారమయ్యాక... తుది తీర్పులను బట్టి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన దస్త్రం ఆర్థిక శాఖ నుంచి న్యాయశాఖ పరిశీలన కోసం పంపామని... అక్కడి నుంచి అనుమతి రాగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో టెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి : క్షిపణి పరీక్షా కేంద్రానికి లైన్​ క్లియర్... షరతులు వర్తిస్తాయి

ABOUT THE AUTHOR

...view details