ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామన్న మంత్రి... స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. పరీక్షల విషయంలో అనేక మార్గాలుంటే పరీక్షల రద్దు అనే మాట ఎందుకని సురేశ్ ప్రశ్నించారు. కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ అడ్మిషన్లు చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా అడ్మిషన్లు ప్రారంభిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్ హెచ్చరించారు.
10th, Inter Exams: పరీక్షలు ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు: మంత్రి సురేశ్ - Minister Suresh Latest News
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పరీక్షలపై కీలక కామెంట్స్ చేశారు. ఇప్పట్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
మంత్రి సురేశ్