ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హెచ్‌సీఏపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఫైర్... అజారుద్దీన్ రియాక్షన్ ఏంటంటే? - Azharuddin latest news

Minister Srinivas goud Vs Azharuddin: జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, హెచ్‌సీఏ ఛైర్మన్ అజారుద్దీన్ స్పందించారు. హెచ్‌సీఏ సమన్వయ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మంత్రి ఆరోపించారు. ఇవాళ్టి ఘటనలో పోలీసుల లోపం లేదని సమర్థించారు. దీనిపై అజారుద్దీన్ రియాక్షన్ ఏంటంటే?

hca
hca

By

Published : Sep 22, 2022, 7:26 PM IST

Minister Srinivas goud Vs Azharuddin: సికింద్రాబాద్​ జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అజారుద్దీన్, సీపీ మహేష్ భగవత్, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారులు ఈ రివ్యూలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక జరగనున్న రెండో మ్యాచ్ ఇది అని, కరోనా తర్వాత జరిగే మ్యాచ్ అయినందున డిమాండ్ ఎక్కువగా ఉందని శ్రీనివాస్‌ గౌడ్ పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది జరగకూడదన్నదే అందరి ఉద్దేశమన్నారు.

పెద్ద ఈవెంట్‌ కనుక చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని మంత్రి తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణకు పేరు తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మ్యాచ్‌ బాగా జరిగితే మరిన్ని మ్యాచ్‌లు తెలంగాణకు వస్తాయని వివరించారు.

క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు ఇవ్వడంలోనూ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాచ్‌ నిర్వహణలో పోలీసుల వైఫల్యం లేదని మంత్రి తెలిపారు. హెచ్‌సీఏ సమన్వయ లోపం వల్లే ఘటన జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగవని హెచ్‌సీఏ హామీ ఇచ్చిందని తెలిపారు. టిక్కెట్లు ఆలస్యంగా ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడంతో సమస్య ఏర్పడిందని వివరించారు.

హెచ్‌సీఏపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఫైర్... అజారుద్దీన్ రియాక్షన్ ఏంటంటే

తెలంగాణ వచ్చాక జరగనున్న రెండో మ్యాచ్ ఇది. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోం. క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు ఇవ్వడంలోనూ తెలంగాణ పట్ల వివక్ష చూపించారు. మ్యాచ్‌ నిర్వహణలో పోలీసుల వైఫల్యం లేదు. హెచ్‌సీఏ సమన్వయ లోపం వల్లే ఘటన జరిగింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగవని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. టిక్కెట్లు ఆలస్యంగా ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడంతో సమస్య. -మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

దీనిపై హెచ్‌సీఏ ఛైర్మన్ అజారుద్దీన్ స్పందించారు. ఏం జరిగిందనే అంశంపై నివేదిక అందిస్తామని వెల్లడించారు. లోపాన్ని సవరించుకుంటామని తెలిపారు. తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రమన్న అజారుద్దీన్, తెలంగాణకు మరింత ఖ్యాతి వచ్చేలా హెచ్‌సీఏ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మ్యాచ్‌ నిర్వహణ చాలా అంశాలతో కూడుకున్నదని అన్నారు. కూర్చుని మాట్లాడుకునేంత సులభం కాదన్నారు.

ఏం జరిగిందనే అంశంపై నివేదిక అందిస్తాం. లోపాన్ని సవరించుకుంటాం. మ్యాచ్‌ నిర్వహణ చాలా అంశాలతో కూడుకున్నది. కూర్చుని మాట్లాడుకునేంత సులభం కాదు. ఈరోజు నేనున్నా, రేపు మరొకరు ఉంటారు, అందరి ఆలోచనే ఒక్కటే. తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడింపచేయడమే లక్ష్యం - అజారుద్దీన్, హెచ్‌సీఏ ఛైర్మన్

చాలా ఏళ్ల తర్వాత మ్యాచ్ నిర్వహించుకునే అవకాశం వచ్చిందని అజారుద్దీన్ అన్నారు. మ్యాచ్‌ నిర్వహించే అవకాశం రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. మ్యాచ్‌ నిర్వహణను ఎప్పుడూ నెగిటివ్ కోణంలో చూడవద్దని సూచించారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని వెల్లడించారు. బాధితులకు హెచ్‌సీఏ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని తెలిపారు.

ఇదీ జరిగింది... భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్​ వేదికగా.. ఈ నెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్​ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్​ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే.. భారీగా అభిమానులు తరలివస్తున్నారు. హెచ్​సీఏ టిక్కెట్లను బ్లాక్​లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్​ఆర్సీలో పిటిషన్​ వేశాడు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆఫ్​లైన్​లో టికెట్లు ఇస్తామని హెచ్​సీఏ ప్రకటించడంతో.. క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. చాలా మంది తరలివస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ.. సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్​ గేట్​ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details