బీసీల గురించి తెదేపా అధినేత చంద్రబాబు విడుదల చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో బీసీలకు కేవలం రూ.1,600 కోట్లు మాత్రమే ఇస్తే.. వైకాపా ప్రభుత్వం రూ.18 వేల కోట్లు కేటాయించిందన్నారు. మరోవైపు మత్స్యకారులందరికీ తెదేపా అన్యాయం చేసిందని.. ముఖం చూపించలేకే చంద్రబాబు మీడియా సమావేశం పెట్టకుండా ప్రకటన జారీ చేశారని దుయ్యబట్టారు. జీవో నెంబరు 217పై అపోహలు సృష్టించేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. ప్రతి జిల్లాలో ఫిషింగ్ జెట్టీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు.
చంద్రబాబు హయాంలో కంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా రంగం మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,363 చెరువులు ఉంటే.. వంద హెక్టార్లపైన ఉన్న 582 చెరువుల్లో 333 చెరువులను లీజు ప్రాతిపదికన స్థానిక మత్స్యకారులకు అప్పగించామన్నారు. 28 రిజర్వాయర్లలో ఫిషింగ్ లైసెన్సులు జారీ చేశామని తెలిపారు. అలాగే మత్స్యకారుల సహకార సొసైటీకి చెరువులు కేటాయించామన్నారు. ఈ అంశాన్ని కూడా తెదేపా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎక్కడా అపోహలకు తావులేకుండా లీజులు జారీ చేశామని ఉద్ఘాటించారు.
రైతులకు అజనంగా ఐదు రుపాయలు..