మూడు రాజధానుల ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని మంత్రి మంత్రి శంకరనారాయణ అన్నారు. శింగనమల మండలం పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం హైదరాబాద్‌ను అభివృద్ధి చేయటం వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. అలాంటి పరిస్థితులు తలెత్తవద్దనే అధికార వికేంద్రీకరణకు సీఎం శ్రీకారం చుట్టారని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు రావటం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.
'పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం' - అమరావతి వార్తల
పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి శంకర నారాయణ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు రావొద్దనే సీఎం జగన్...పరిపాలన వికేంద్రీకరణ దిశగా నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
minister shankar narayana