ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే స్థాయి నారా లోకేశ్‌కు లేదని మంత్రి శంకరనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఉన్నారన్న విషయం కూడా తెలియని లోకేశ్.. ప్రభుత్వాన్ని విమర్శించటం సిగ్గుచేటని విమర్శించారు. తెదేపా పాలనలో కనీసం రైతులను పట్టించుకోలేదని.. ఇవాళ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జిల్లాల్లోని పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు పర్యటనలు చేస్తున్నారు తప్ప..రైతులపై ప్రేమతో కాదన్నారు. కరోనా సమయంలోనూ పక్క రాష్ట్రానికి వెళ్లి దాక్కున్నారని మండిపడ్డారు.
రైతులపై తెదేపా నేతలది కపట ప్రేమ: మంత్రి శంకరనారాయణ - లోకేష్‌పై మంత్రి శంకరనారాయణ ఫైర్
తెదేపా నేతలపై మంత్రి శంకరనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత పాలనలో కనీసం రైతులను పట్టించుకోలేదని... ఇవాళ రైతుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. క్యాడర్‌ను కాపాడుకునేందుకు లోకేశ్..జిల్లా పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
minister shankar narayana