ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఫోన్​ ట్యాపింగ్​పై చంద్రబాబు ఆధారాలు చూపాలి' - chandrababu

ఫోన్ ట్యాపింగ్​పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని రాష్ట్ర మంత్రి శంకరనారాయణ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

minister Shankar Narayana
minister Shankar Narayana

By

Published : Aug 21, 2020, 9:39 PM IST

ఫోన్ ట్యాపింగ్​పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని రాష్ట్ర మంత్రి శంకరనారాయణ డిమాండ్ చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన... కేవలం జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని విమర్శించారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు వచ్చిన ఇబ్బంది ఏంటని మంత్రి ప్రశ్నించారు. కోర్టుల్లో కేసులు వేస్తూ పంపిణీ ప్రక్రియను అడ్డుకున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్​ పని చేస్తుంటే...అనేక విధాలుగా అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details