Minister Shankar Narayana on Roads development: రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు చెల్లిస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ప్రకటించారు. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న 550 కోట్ల రూపాయల మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాల్సిందిగా సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ) రుణ సహకారంతో 2970 కోట్ల రూపాయలతో తొలిదశలో చేపట్టిన పనులకు సంబంధించి త్వరితగతిన పనులు చేపట్టకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా బిల్లులను చెల్లిస్తామని ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు. జనవరిలోగా పనుల్లో కదలిక లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Roads development in andhrapradesh: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులపై ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులు, అభివృద్ధికి సంబంధించి రూ.2208 కోట్ల వ్యయంతో 1152 పనులకు అనుమతి మంజూరు అయిందని మంత్రి వెల్లడించారు. 1764 కోట్ల రూపాయల వ్యయమయ్యే పనులు చేపట్టేందుకు వీలుగా ఒప్పందాలు జరిగినట్టు తెలిపారు. మిగిలిన పనుల్ని కూడా వచ్చే నెలలోగా ఒప్పందాలు పూర్తి చేసి కార్యాచరణ ప్రారంభించనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. జూన్ 2022 లోగా మరమ్మతుల పనులు పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిపారు. చిత్తూరు, కడప, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కృష్ణా, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇప్పటికే రహదారుల అభివృద్ధి పనులు వేగంగా మంత్రి స్పష్టం చేశారు.