ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అచ్చెన్నాయుడు అవినీతిపరుడు.. అందుకే అరెస్ట్ చేశారు'

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై మంత్రి శంకరనారాయణ స్పందించారు. ఆయన చేసిన అవినీతి బహిర్గతమైందని.. అందుకే ఏసీబీ అరెస్ట్ చేసిందని స్పష్టంచేశారు. దీనికి తెదేపా నేతలు కులం కార్డు వేయడం ఏమిటని ప్రశ్నించారు.

minister sankara narayana about acchhennayudu arrest
శంకర నారాయణ, మంత్రి

By

Published : Jun 12, 2020, 2:59 PM IST

అచ్చెన్నాయుడు అవినీతిపరుడని.., అతనిని అరెస్ట్ చేస్తే తెదేపా నేతలు కులం కార్డు వేస్తున్నారని.. మంత్రి శంకరనారాయణ అన్నారు. బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం మేలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీసీలందరూ సీఎం జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని.., దాన్ని చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు చేసిన అవినీతి బహిర్గతమైంది కాబట్టే అరెస్ట్ చేశారని స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details