ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lockup Death: మరియమ్మ కుటుంబానికి సాయం అందజేత - minister puvvada on mariyamma incident

తెలంగాణలో లాకప్ డెత్ అయిన మరియమ్మ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ నామా నాగేశ్వరరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మరియమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం అందజేశారు.

mariyamma
మరియమ్మ కుటుంబానికి సాయం

By

Published : Jun 29, 2021, 9:22 AM IST

మరియమ్మ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సాయం అందజేత

తెలంగాణలో లాకప్ డెత్ అయిన మరియమ్మ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే దళిత కుటుంబానికి జరగవద్దన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మరియమ్మ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ నామా నాగేశ్వరరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంనకు వెళ్లిన మంత్రి.. మరియమ్మ కుటుంబీకులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం అందజేశారు.

తొలుత మరియమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మరియమ్మ కుటుంబసభ్యులను పరామర్శించి.. ఓదార్చారు. కుమారుడు ఉదయ్​కిరణ్​కు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రంతో పాటు రూ.15 లక్షలు అందజేశారు. ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.35 లక్షల విలువ చేసే చెక్కులు అందజేశారు.

భవిష్యత్తులోనూ అండగా ఉంటాం..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మరియమ్మ కుమారుడు ఉదయ్​కు ప్రభుత్వ ఉద్యోగ నియామకపత్రం, రూ.15 లక్షల చెక్కు, ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించాం. దళితుల హక్కులను కాపాడేందుకు సీఎం పట్టుదలగా ఉన్నారు. మరియమ్మ ఉదంతం తెలిసిన వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని తీవ్రంగా స్పందించారు. తక్షణమే మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగం ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మేము కోమట్లగూడెంలోని వారి ఇంటికి వచ్చి సాయం అందించాం. అనారోగ్యంతో ఉన్న ఉదయ్​కు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. భవిష్యత్తులోనూ మరియమ్మ కుటుంబానికి అండగా ఉంటాం.-పువ్వాడ అజయ్​కుమార్​, రవాణ శాఖ మంత్రి

దళితుల అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారన్న ఎంపీ నామా నాగేశ్వరరావు.. రాబోయే రోజుల్లో దళితులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉంటారని వెల్లడించారు.

దళితులకు అన్ని విధాలా అండగా ఉండాలనే ఉద్దేశంతో నిన్న సీఎం కేసీఆర్​ అన్ని పార్టీలకు చెందిన దళిత నాయకులందరితో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో దళితులను అన్ని విధాలా ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. దళితులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలన్న మా నాయకుని ఆదేశం మేరకు మేము కూడా గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గాల్లో వారికి అండగా ఉంటాం. మరియమ్మ విషయంలో కొంత ఇబ్బంది జరిగినా.. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా తక్షణమే స్పందించి, సాయం అందించలేదు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల్లోని అందరూ బాగుండాలని ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఇకపైనా అవి అలాగే కొనసాగిస్తాం. -నామా నాగేశ్వరరావు, ఎంపీ

ఇదీ చదవండి:

CM JAGAN: 24 గంటలూ.. పిల్లలకు వైద్య సేవలు

COVID EFFECT: రాబడిపై కరోనా దెబ్బ.. వరుసగా రెండో ఏడాదీ కష్టాలు

ABOUT THE AUTHOR

...view details