పాడె మోసిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ - కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో మంత్రి పువ్వాడ
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖిలా బజార్లో తెరాస కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.
పాడె మోసిన మంత్రి పువ్వాడ
తెలంగాణ ఖమ్మం జిల్లా కేంద్రంలో తెరాస కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. అంతకు ముందు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చివరి దాకా స్మశాన వాటిక వరకు వెళ్లి ఆయనకు పువ్వాడ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.