తెలంగాణలో ఆర్టీసీ(TSRTC) ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షలో తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. ఛార్జీల పెంపుపై అధికారులు సమాలోచనలు జరిపి పలు ప్రతిపాదనలు రూపొందించారు.
పల్లె వెలుగుకు కి.మీ.కు 25పైసలు, ఎక్స్‌ప్రెస్, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదనలు చేశారు. సిటీ ఆర్డినరీ సర్వీసులకు కి.మీ.కు 25పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదింంచారు. సీఎం కేసీఆర్ పరిశీలన తర్వాతే ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు.
రెండు నెలల క్రితమే.. సీఎం వద్ద ఛార్జీల వద్ద ప్రతిపాదన తెచ్చాం. ఛార్జీలు పెంచినా ఆర్టీసీ నష్టాల బారి నుంచి గట్టెక్కడం కష్టమే. కానీ పెంపు తప్పదు. సమాలోచనలు జరిపి.. ఒక్కో సర్వీసుపై పలు ఛార్జీలు ప్రతిపాదించాం. సీఎం కేసీఆర్ ఈ నివేదికలు పరిశీలించిన తర్వాతనే.. నిర్ణయం తీసుకుంటాం.-బాజిరెడ్డి గోవర్దన్, టీఎస్ఆర్టీసీ ఛైర్మన్
చమురు ధరలు తగ్గినా