ఎస్సీలకు న్యాయం చేయటంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినేపి విశ్వరూప్ అన్నారు. సీతానగరంలో ఎస్సీ యువకుడు ప్రసాద్ ఘటనలో బాధ్యులైన అందరికీ చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణమూర్తిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారని... దర్యాప్తు అనంతరం వెంటనే అరెస్టు చేస్తామన్నారు. ఎస్సీలకు తమ ప్రభుత్వం చేసిన విధానాలు చర్చిండానికి చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
రాజకీయ పబ్బం కోసమే హర్షకుమార్ ఆరోపణలు : మంత్రి పినిపే
ఎస్సీ యువకుడి శిరోముండనం కేసులో పోలీసు విచారణ జరుగుతోందని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ రాజకీయ పబ్బం కోసమే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఎస్సీలకు న్యాయం చేయటంలో ఎప్పడూ ముందుంటాం: మంత్రి పినేపి