విచక్షణాధికారాల పేరిట మండలి ఛైర్మన్ ఇష్టం వచ్చినట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడడం కుదరదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మండలిలో విపక్షనేత యనమల రామకృష్ణుడు తన అనుభవంతో తెలుగుదేశాన్ని గోతిలోకి నెట్టారని పిల్లి విమర్శించారు. ప్రివిలెజ్ మోషన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శిని తెదేపా భయపెడుతోందని ఆరోపించారు. సెలెక్ట్ కమిటీ అంటే ప్రభుత్వానికేమీ భయం లేదన్నారు. యనమల అర్థ రహిత ప్రకటనలు మానుకోవాలని సూచించారు.
'సెలెక్ట్ కమిటీకి ప్రభుత్వం భయపడదు'
ఏదైనా విషయం పూర్తి సందిగ్ధంలో ఉన్నప్పుడే విచక్షణాధికారం ఉపయోగిస్తారని.. కానీ మండలి ఛైర్మన్ ఇష్ట వచ్చినట్లు విచక్షణాధికారం ఉపయోగించారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ఓటింగ్, డివిజన్ లాంటి ప్రక్రియలు అనుసరించాలని సూచించారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో మండలి ఛైర్మన్ నిబంధనలు పాటించలేదని పునరుద్ఘాటించారు.
తెదేపాపై పిల్లి సుభాష్ వ్యాఖ్యలు