ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీ విలీనానికి అవరోధాలు లేవు : మంత్రి పేర్ని నాని

ఏపీఎస్​ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి అవరోధాలు లేవని మంత్రి పేర్నినాని వెల్లడించారు. విలీనానికి...ఆర్టీసీ బోర్డు అంగీకారం కూడా తెలిపిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రభావం ఏపీపై ఉండదని మంత్రి అన్నారు. ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం... ఏపీ, టీఎస్ ఆర్టీసీలకు వేరువేరుగా నిధులు ఎలా మంజూరుచేసిందని ఆయన ప్రశ్నించారు.

ఆర్టీసీ విలీనానికి ఎలాంటి అవరోధాలు లేవ్ : మంత్రి పేర్ని నాని

By

Published : Nov 7, 2019, 8:47 PM IST

Updated : Nov 7, 2019, 10:28 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి అవరోధాలు లేవని రవాణాశాఖ మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకునేందుకు ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని, ఆయన కూడా విలీనప్రక్రియకు అంగీకరించారని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ కేంద్రంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలేవీ ఏపీఎస్​ఆర్టీసీ విలీన ప్రక్రియపై ప్రభావం చూపబోవని మంత్రి చెప్పారు. ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమేనని .. విలీన ప్రక్రియను ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా అధిగమిస్తామని మంత్రి తెలిపారు.

మరి నిధులేలా ఇచ్చారు

ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం హైకోర్టుకు చెబితే.. ఏపీ- తెలంగాణలకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు నిధులు ఎలా ఇచ్చిందని మంత్రి ప్రశ్నించారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపైనా మంత్రి స్పందించారు. రవాణా శాఖ అధికారులు చట్టప్రకారమే బస్సులు సీజ్ చేశారని.. ఈ విషయంలో ఆయన అవాస్తవాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వైకాపాలోకి ఆయనను ఎవరు ఆహ్వానించారో చెప్పాలని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి :

అక్రమ కేసులను సమర్థంగా ఎదుర్కొంటాం: చంద్రబాబు

Last Updated : Nov 7, 2019, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details