ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2020, 5:42 PM IST

Updated : Jun 16, 2020, 6:50 PM IST

ETV Bharat / city

'మూడు పార్టీలు తిరిగినా ఎవరూ సీటు ఇవ్వలేదు'

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి పేర్నినాని విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణరాజుకి 3 పార్టీలు తిరిగినా ఎవరూ సీటు ఇవ్వలేదని... వైకాపా తరుపున సీటు ఇచ్చి గెలిపించామన్నారు. రఘురామకృష్ణరాజుకు సొంతంగా గెలిచేంత బలమే ఉంటే..... సొంత పార్టీ పెట్టుకోవచ్చు కదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

minister perni-neni-comments
మంత్రి పేర్ని నాని

మంత్రి పేర్ని నాని

రఘురామకృష్ణరాజుకి 3 పార్టీలు తిరిగినా ఎవరూ సీటు ఇవ్వలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. గత ఎన్నికల్లో నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు ఎన్ని వచ్చాయో..? మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో? సరిచూసుకోండని సూచించారు. మీ ఎంపీ స్థానంలోని ఎమ్మెల్యేలను ఎలా గెలిపించారో చెప్పాలన్నారు. వైఎస్ఆర్ బొమ్మ, జగన్ కష్టంపైనే వైకాపాలోని ఎమ్మెల్యేలు గెలిచారని పేర్ని నాని స్పష్టం చేశారు.

  • జగన్ పట్ల చచ్చే వరకు విశ్వాసంతోనే ఉంటాం...

అవసరం కోసం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత మీకు కనిపించడం లేదని మంత్రి నాని విమర్శించారు. మమ్మల్ని గెలిపించిన జగన్ పట్ల చచ్చే వరకు విశ్వాసంతో ఉంటామని పేర్ని నాని తెలిపారు. మోదీ భయంతోనే చిదంబరం అరెస్టుపై రఘురామకృష్ణరాజు మాట్లాడట్లేదని ధ్వజమెత్తారు. రఘురామకృష్ణరాజు ఆశిస్తున్నవి ఏవీ ఇక్కడ జరగవని...ఆయన పై మా వ్యూహం ఏంటో రోజురోజుకూ తెలుస్తోందన్నారు.

  • కులాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోండి: శ్రీరంగనాథరాజు

రఘురామకృష్ణరాజుకు సొంత ఊరిలోనే తక్కువ ఓట్లు వచ్చాయని....ఎమ్మెల్యేలకు మెజారిటీ వచ్చిన చోట కూడా ఆయనకు ఓట్లు తగ్గాయని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఎమ్మెల్యేలు కరోనా కట్టడి చర్యల్లో ఉంటే తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదన్నారు. రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెట్టే పనులు మానుకోవాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:మూడు రాజధానుల బిల్లు మళ్లీ సభ ముందుకు అవసరమా?

Last Updated : Jun 16, 2020, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details