Polavaram: ముఖ్యమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి పోలవరం ప్రాజెక్టు పర్యటన సందర్భంగా కనివినీ ఎరుగని రీతిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను సైతం పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు వాహనాలను ప్రాజెక్టు వరకూ అనుమతించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఓ దశలో జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్ని నాని వాహనాన్ని సైతం పోలీసులు అడ్డగించారు. దీంతో ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను అనుమతించకపోతే సీఎం, కేంద్ర మంత్రి పర్యటనను పోలీసులే నిర్వహించుకోవాలని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.