పవన్ కల్యాణ్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఉత్తరాది భాజపా దక్షిణాదికి అన్యాయం చేస్తోందని పవన్ అన్నారని... ఇప్పుడేమో భాజపాకు మద్దతివ్వాలని అంటున్నారని ధ్వజమెత్తారు. విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం కేసుల్లో భాజపా ప్రమేయం ఉందని పేర్ని నాని ఆరోపించారు. అందుకే సీబీఐ విచారణ కోరినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంటే పవన్ మాత్రం జగన్‌ను తిడుతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారు. సునీల్ దేవధర్.. పంచాయతీ సర్పంచిగా కూడా గెలవరు. ప్రత్యేక హోదాపై పవన్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు? విశాఖ ఉక్కును అమ్మేస్తామంటున్నా భాజపాను ఎందుకు నిలదీయరు?- పేర్ని నాని, మంత్రి