ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్వయంప్రకటిత మేధావులే ఆంగ్లమాధ్యమాన్ని తప్పుపడుతున్నారు' - వైఎస్‌ఆర్‌ భరోసా

ఏపీ పర్యావరణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇప్పటి వరకు పరిశ్రమ వ్యర్థాలపై పరిశీలన, నియంత్రణ మాత్రమే ఉండేదన్న మంత్రి... ఇకపై పరిశ్రమ వ్యర్థాల తరలింపు, ప్రాసెసింగ్, శుద్ధి బాధ్యత ప్రభుత్వానిదేనని వివరించారు.

మంత్రి పేర్ని నాని

By

Published : Nov 13, 2019, 4:39 PM IST

మంత్రి పేర్ని నాని

ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడతామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 2020 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేస్తామన్న మంత్రి... ఆంగ్లమాధ్యమంలోనూ తెలుగు లేదా ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి ఆంగ్లమాధ్యమం తప్పనిసరని వివరించారు.

కొందరు స్వయంప్రకటిత మేధావులు ఆంగ్లమాధ్యమాన్ని తప్పు పడుతున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులు, విద్యా కమిటీల సూచనల మేరకే ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతున్నాని స్పష్టం చేశారు. దాదాపు రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలన్నీ ఆంగ్లమాధ్యమంలోనే ఉన్నాయన్న మంత్రి... వెనకబడిన కులాలకు చెందిన వారి పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వెనకబడిన వర్గాల వారి పిల్లలకు ఆంగ్లమాధ్యమం చదువులు వద్దా..? అని ప్రశ్నించారు. ప్రమాదంలో చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.10 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు పేర్ని నాని పేర్కొన్నారు. 30 అడుగుల రోడ్డు ఉన్న లేఅవుట్లకు మాత్రమే క్రమబద్ధీకరణ అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... లోకేశ్‌పై సభాహక్కుల నోటీసుకు వైకాపా నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details