minister perni nani on OTS: గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వం వద్ద తాకట్టులో ఉన్న ఇంటి స్థలాలు, నిర్మించుకున్న ఇళ్లపై పూర్తి హక్కులు కల్పించడమే లక్ష్యంగా ఓటీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈనెల 21న సీఎం జగన్ తణుకులో పర్యటించనున్న సందర్భంగా.. మంత్రి ఆళ్ల నానితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, బాలుర ఉన్నత పాఠశాలలో బహిరంగ సభ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఓటీఎస్ పథకంతో గృహలబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పిస్తాం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రైవేటు ఆస్తి మాదిరిగా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే వీలు దక్కుతుంది. అమ్ముకోవడంతోపాటు వారసులకు చట్టబద్ధంగా అప్పగించేందుకు అవకాశం వస్తుంది - మంత్రి పేర్ని నాని