ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Minister Perni Nani: 'తెలంగాణలో అందుకే కొత్త పార్టీలు.. ఏపీలో ఆ పరిస్థితి లేదు'

రాష్ట్ర మంత్రి పేర్ని నాని మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు(minister perni nani comments on telangana news). తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు వస్తున్నాయని అన్నారు. నదీ జలాల విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు(minister perni nani on cm kcr news).

Minister Perni Nani
minister perni nani interesting comments on telangana politics

By

Published : Oct 29, 2021, 4:03 PM IST

Updated : Oct 29, 2021, 4:37 PM IST

తెలంగాణాలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు(minister perni nani comments on telangana politics news). అందుకే ఓ ఐపీఎస్​కు రాజీనామా చేసి మరీ పార్టీలోకి చేరారని.. మరికొన్ని పార్టీలు కూడా వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుందని..? మంత్రి ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల గుండెల్లో ఎక్కడా శూన్యత లేదన్నారు.

మరోవైపు నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట తప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు(minister perni nani comments on cm kcr news). డిండి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించబోమని ఎప్పుడో చెప్పామని ఉద్ఘాటించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంతదూరమో.. విజయవాడ నుంచి హైదరాబాద్ అంతే దూరమని గమనించాలన్నారు. రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే రేవంతి రెడ్డి వంటి వాళ్లు(minister perni nani slams reavanth reddy news).. సంచలనాల కోసం ఏ అంశంపై అయినా ట్వీట్లు చేస్తారని సెటైర్ విసిరారు.

ఇదీ చదవండి
CM Jagan: ప్రతీ గ్రామంలోని డిజిటల్‌ లైబ్రరీకి.. ఇంటర్నెట్‌ ఇవ్వండి: ముఖ్యమంత్రి జగన్

Last Updated : Oct 29, 2021, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details