ఏపీఎస్ఆర్టీసీని బ్రతికించాలన్నదే సీఎం జగన్ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. తెలంగాణ ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం చూపబోదని వ్యాఖ్యానించారు. ప్రజలకు కాస్త ఇబ్బందులు తలెత్తినా... ఆర్టీసీకి వచ్చే రాబడిలో పెద్ద తేడా ఉండదని చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు సొంత వాహనాల్లో వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బస్సులు తిరగకపోవడం కంటే కొవిడ్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువని వివరించారు. ఆర్టీసీ... ప్రజా - ప్రభుత్వం చేతిలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా చూస్తున్నామన్నారు. డిమాండ్ ను బట్టి అన్ని రూట్లలో బస్సులను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ఆ ఒప్పందంతో ఆర్టీసీకి పెద్దగా నష్టం ఉండదు: మంత్రి పేర్ని నాని - minister perni nani reaction on rtc agrement news
తెలంగాణ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందంతో రాష్ట్ర ఆర్టీసీకి పెద్దగా నష్టం ఉండదని మంత్రి పేర్నినాని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీని బ్రతికించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో బస్సులను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
minister perni nani