ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Perni Nani: 'ప్రభుత్వాసుపత్రిలో కొందరు ఉద్యోగులు పద్ధతి మార్చుకోవాలి' - ప్రభుత్వాసుపత్రి ఉద్యోగుల తీరుపై మండిపడ్డ మంత్రి పేర్నినాని

ప్రభుత్వాసుపత్రిలో కొందరు ఉద్యోగులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి పేర్నినాని(Perni Nani) హెచ్చరించారు.

Minister Perni Nani
Minister Perni Nani

By

Published : Jun 22, 2021, 8:40 PM IST

ప్రభుత్వాసుత్రిలో కొందరు ఉద్యోగులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. కాంట్రాక్టు స్వీపర్ల ఉద్యోగ నియామకాలు మొదలుకొని.. విధులలో సైతం అనవసర జోక్యం చేసుకుంటున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని సూచించారు. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని పేర్ని నాని(Perni Nani) హెచ్చరించారు.

మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ.. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకొని..చాలా సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.

ABOUT THE AUTHOR

...view details