అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రైతులు దూషించినా, కొట్టినా, తిట్టినా పట్టించుకోబోమన్నారు. అమరావతి నుంచి బ్యారేజ్, లింక్ రోడ్లు, బాహ్యవలయ రహదారి నిర్మిస్తామని వివరించారు. తమ భూముల విలువ పెరగాలని అమరావతి రైతుల ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. అమరావతి భూముల విలువ పెంచేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎన్‌వోసీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
'అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది' - amarvathi movement latest news
అమరావతి అభివృద్ధి కోసం వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్ని నాని ఉద్ఘాటించారు. అమరావతి భూముల విలువ పెంచేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
!['అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది' minister perni nani comments on development of amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10741034-427-10741034-1614079701333.jpg)
minister perni nani comments on development of amaravathi
అమరావతి అభివృద్ధిపై పేర్నినాని వ్యాఖ్యలు