ఆ జీవోలో తప్పేముంది ?: మంత్రి పేర్ని నాని - minister peri nani about latest g.o news
అక్టోబర్ 10న రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలో తప్పేముందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. నిరాధార వార్తలను అరికట్టడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు.
perni nani
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో వల్ల పత్రికలు, విలేకర్ల స్వేచ్ఛకు ఎటువంటి విఘాతమూ కలగదని మంత్రి పేర్ని నాని చెప్పారు. తప్పుడు కథనాలపై సంబంధిత అధికారి వెల్లడించిన వాస్తవాలను పత్రికలు లేదా టీవీ ఛానెళ్లలో తప్పకుండా ప్రచురించేలా ఈ చట్టం తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు. మీడియాకు సంకెళ్లు అంటూ కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నిరాధార, ఊహాత్మక వార్తలను నిరోధించడమే నూతన చట్టం ఉద్దేశమని పేర్ని నాని స్పష్టం చేశారు.
Last Updated : Nov 1, 2019, 10:12 PM IST