క్షేత్రస్థాయిలో పింఛన్ల పంపిణీ, అమలు తీరుపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్లు హాజరయ్యారు. పింఛన్లలో కోతల విధింపు అంశాన్ని ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఫించన్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని వైకాపా ఎమ్మెల్యేలు తెలిపారు. నిబంధనల మేరకే లబ్దిదారుల ఎంపిక జరుగుతోందన్న అధికారులు..ప్రతి నెలా 1వ తేదీన ఇంటి వద్దే పింఛన్లు ఇస్తున్నామని వివరించారు. అయితే పింఛను లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లను ఎమ్మెల్యేలు..అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
'నిబంధనల మేరకే పింఛన్ లబ్దిదారుల ఎంపిక'
పింఛన్ల పంపిణీ, అమలు తీరుపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పింఛన్లలో కోతల విధింపు అంశాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.
పింఛన్ల పంపిణీ, అమలు తీరుపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష