జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని రాష్ట్ర పంచాయితీరాజ్, పురపాలక శాఖ మంత్రులు...... పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. సచివాలయంలో అధికారులతో సమావేశమైన ఇరువురు మంత్రులు... సచివాలయ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
పక్కా భవనాలను నిర్మించండి
ఎఎన్ఎం 983, మహిళా పోలీస్ పోస్టులు 899, వార్డు ప్లానింగ్ , రెగ్యులరైజేషన్ సెక్రటరీ పోస్టులు735, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 615 ఖాళీగా ఉన్నట్లు మంత్రులు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా స్పోర్ట్స్ కోటా పోస్టులను వెంటనే భర్తీచేయాలని సూచించారు. గ్రామ,వార్డు సచివాలయాలకు పక్కా భవనాలను నిర్మించాలని మంత్రులు ఆదేశించారు.
ఇదీ చదవండి : 'ఆ షరతులకు లోబడి ఉంటేనే... పోలవరానికి నిధులు'