ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిధుల కొరత లేదు.. పనులు జరిపించండి: మంత్రి పెద్దిరెడ్డి - ఉపాధి హామీ పథకం వేతనాలు తాజా వార్తలు

కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఉపాధి హామి కూలీలకు పని కల్పించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. పథకం చెల్లింపుల కోసం 582.47 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిందని.. నిధుల కొరత లేనందున పని కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

minister peddi reddy on mgnrei funds
మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Apr 27, 2021, 7:51 AM IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెల్లింపుల కోసం రూ.582.47 కోట్లను కేంద్రం విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలోని వేతన బకాయిలు కూడా ఈ మొత్తంలో కలిసి ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 60 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని మంత్రి వివరించారు. ఈ వేతన మొత్తాలు అప్ లోడ్ చేసిన ఎఫ్.టీ.ఓ ఆధారంగా ఎప్పటికప్పుడు నేరుగా కూలీల ఖాతాలకు జమ అవుతాయని మంత్రి పేర్కొన్నారు.

మండు వేసవితో పాటు కరోనా తీవ్రత దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ కూలీలకు పనులు కల్పించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. కరవు పరిస్థితులు ఉన్న మండలాల్లో అడిగిన ప్రతి కూలీకి పని కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. నిధుల కొరత లేదని.. పని కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని 13 జిల్లాల అధికారులకు మంత్రి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details