గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదులను నమోదు చేయటానికి మెుబైల్ యాప్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబరును కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదులు అందిన 48 గంటల్లోగా సమస్య పరిష్కరించాలని మంత్రి చెప్పారు. వీధి దీపాల నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎనర్జీ అసిస్టెంట్లను భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు.