రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణంలో భాగంగా 25 వేల కిలోమీటర్ల మేర కోటి మొక్కలు నాటాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామ సర్పంచ్లకు నిర్దేశించారు. తెలంగాణ, కర్ణాటక తరహాలో స్థల లభ్యతను బట్టి రోడ్డుకిరువైపులా.. రెండు మూడు వరుసల్లో మొక్కలు నాటి.. పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.
వైఎస్ఆర్ పేదరైతు తోడ్పాటులో భాగంగా ఒక ట్రాక్టర్ ఇస్తామని.. ఆ కుటుంబం 10 నుంచి 15 కిలోమీటర్ల మేర మొక్కల సంరక్షణ చూసుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఉపాధి హామీ ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంకు రుణం తీర్చుకునేలా దీన్ని అమలు పరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే బ్లాక్ ప్లాంటేషన్ కింద ఖాళీ స్థలాలు, శ్మశానాలు, కాల్వగట్లు, రైల్వే ఖాళీ స్థలాలు వంటి సామాజిక ప్రదేశాల్లో మొక్కలు నాటాలని అన్నారు. మొదటి దశ నాడు - నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో సైతం మొక్కలు నాటాలని చెప్పారు. ప్రస్తుతం 6 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని.. వాటిని సంరక్షించాలని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
వలస కూలీలకు ఉపాధి