ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబుది కుట్రపూరిత రాజకీయం: మంత్రి పెద్దిరెడ్డి - minister peddireddy fiers on chandrababu

కుట్రపూరిత రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. సంబంధం లేని అంశాలను వైకాపాపై రుద్దే ప్రయత్నం చేయటం దారుణమన్నారు. మాజీ జడ్జి రామకృష్ణ, తంబళ్లపల్లె ఘటనలపై విష ప్రచారం చేయటం తగదన్నారు.

ministrs _peddireddy
ministrs _peddireddy

By

Published : Dec 12, 2020, 8:05 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుట్రపూరిత రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల అమలు తీరుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... మాజీ జడ్జి రామకృష్ణ 13 సంతవ్సరాల కిందట సస్పెండ్ అయ్యారని చెప్పారు. చెక్కుల ఫోర్జరీ కేసులో బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో జైలు పాలయ్యారని వివరించారు. వాటిని సైతం తమపై నిందలు మోపడం తగదన్నారు. తంబళ్లపల్లెలో తెదేపా నేతలు చేసిన అవినీతిపై అదే పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. ఆ ఘటనను కూడా వైకాపాపై రుద్దే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.

తెలుగుదేశం పార్టీ దళితుల వ్యతిరేకమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. పెద్దిరెడ్డి కుటంబానికి దళితులంతా అండగా నిలుస్తామన్నారు. అనంతరం మంత్రులిద్దరూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details