రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర జరుగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తికాకుండా ఆగమేఘాల మీద ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడమేంటని మండిపడ్డారు. మార్చి 31 వరకు తానే ముఖ్యమంత్రిలా అనుకుంటున్నారా అని ఎస్ఈసీని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆయన ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. సోమవారం సుప్రీం తీర్పును అనుసరించి తమ నిర్ణయం ఉంటుందని చెప్పారు. అంతవరకు ఏ అధికారి ఎన్నికల విధుల్లో పాల్గొనరని... ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు సహకరించేది లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల విధుల్లో ఏ అధికారి పాల్గొనరు: మంత్రి పెద్దిరెడ్డి - ఎస్ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు వార్తలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీరుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు సహకరించేది లేదని స్పష్టం చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి