మూడు రాజధానులతో రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో 33 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలంటే సాధ్యం కాదన్న ఆయన... మంచి ప్యాకేజీ ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న భూమిని వెనక్కు ఇస్తామని చెప్పారు. అమరావతిలో తగిన భూమి తీసుకొని అంతవరకు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
రైతులకు సచివాలయంలో ఎలాంటి పని ఉండదని... కేవలం ఐదు నుంచి పది శాతం మందికే పని ఉంటుందన్నారు. ప్రస్తుతం రైతులతో మాట్లాడే పరిస్థితి లేదని.. వాళ్లు వినే పరిస్థితుల్లో కూడా లేరని వ్యాఖ్యానించారు. తప్పకుండా రైతులు వాస్తవాలు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.