అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో కక్ష సాధింపు ఏముందని.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తప్పు చేసినందుకే అరెస్టు చేశారని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు ఎలా బెదిరించాడో అందరూ చూశారన్న మంత్రి పెద్దిరెడ్డి... ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మంత్రులైన మమ్మల్ని బెదిరించేలా గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
'తప్పు చేసినందుకే అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారు' - Atchannaidu Arrest Latest news
తప్పు చేసినందుకే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అచ్చెన్నాయుడు అరెస్టును స్వాగతిస్తున్నట్టు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు అరెస్టును స్వాగతిస్తున్నట్టు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్.. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారని... ఎన్నికల కమిషన్ పరిధిలో అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందని వివరించారు. అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జన్యానికి పాల్పడ్డారని, కింజరాపు అప్పన్నను భయబ్రాంతులకు గురిచేశారని చెప్పారు. పోలీసులను భయపెట్టే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని... పోలీసులను సైతం మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండీ...తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం