చంద్రబాబు కనుసన్నల్లో రమేశ్ కుమార్ పని చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నప్పుడు ఆయన్ను మారిస్తే తప్పేంటని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. తొలగింపు విషయంలో విమర్శలు చేసేంత శ్రద్ధ రాష్ట్ర శ్రేయస్సు గురించి తీసుకుంటే బాగుండేదని హితవు పలికారు. ప్రతిపక్షానికి చెప్పి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో గంటల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయాలు చేయడం తగదని అన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆక్వా రంగానికి ఇబ్బందుల్లేకుండా తగిన జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు.
'అనుమానాలు తలెత్తినప్పుడు మారిస్తే తప్పేంటి?' - latest updtes of corona
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రమేశ్ కుమార్ తొలగింపు విషయంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలపై చూపుతున్న శ్రద్ధ... రాష్ట్ర శ్రేయస్సు గురించి తీసుకుంటే బాగుండేదని మంత్రి మోపిదేవి అన్నారు. ఎస్ఈసీ తొలగింపుపై రాజకీయాలు మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
minister-mopidevi-on-sec-change