ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 29, 2020, 4:55 PM IST

ETV Bharat / city

100 కోట్లతో... విశాఖ హార్బర్ ఆధునీకరణ : మోపిదేవి వెంకటరమణ

రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. జాతీయస్థాయిలో 40 శాతం వాటా కల్గిన మత్య్స పరిశ్రమ అభివృద్ధికి పలు జిల్లాల్లో ఫిషింగ్ జెట్టిలు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 100 కోట్లతో విశాఖ హార్బర్​ ఆధునీకరణ పనులు చేపడతామని మంత్రి ప్రకటించారు. మండలి రద్దు అవ్వగానే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెంకటరమణ స్పష్టం చేశారు.

Minister mopidevi
మోపిదేవి వెంకటరమణ

ఫిషింగ్ జెట్టిల ఏర్పాటుపై మంత్రి మోపిదేవి వ్యాఖ్యలు
వ్యవసాయ రంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. మార్కెటింగ్ శాఖ సమీక్ష అనంతరం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మత్య్సపరిశ్రమకు జాతీయస్థాయిలో 40 శాతం వాటా ఉందన్న ఆయన... ఆ పరిశ్రమకు సంబంధించి ఫిషింగ్ జెట్టిల నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఆక్వా రంగానికి పవర్ టారిఫ్ విషయంలో మినహాయింపు ఇస్తున్నామని మంత్రి ప్రకటించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల ఓడరేవులతో పాటు తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో మత్స్యకారులకు జెట్టిలు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఫిషింగ్ జెట్టిల ఏర్పాటులో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలు గుర్తించామని మంత్రి తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్​ను రూ.100 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ పనులు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 22 చోట్ల ఫిషింగ్ జెట్టిలు చేయనున్నట్లు తెలిపారు.
రాజీనామాపై మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలు

రాజీనామాపై మంత్రి ఏమన్నారంటే..

మండలి రద్దు చేస్తున్నట్లు కేంద్రం నుంచి సమాచారం రాగానే... మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజీనామా చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :'మీ ఆస్తులు కాపాడుకునేందుకే.. అమరావతిలో కృత్రిమ ఉద్యమం'

ABOUT THE AUTHOR

...view details