ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మత్స్యకారులను తరలించేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 కోట్లు'

లాక్​డౌన్​తో చిక్కుకున్న మత్స్యకారులను దూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు తరలించేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి మోపిదేవి అన్నారు. వీరిని వారి వారి ప్రాంతాలకు చేర్చేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చేపలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు త్వరలో అధికారిక సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

'మత్స్యకారులను తరలించేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 కోట్లు'
'మత్స్యకారులను తరలించేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 కోట్లు'

By

Published : Apr 29, 2020, 1:46 PM IST

ఇప్పటివరకు 1700 మంది మత్స్యకారులను క్వారంటైన్ అనంతరం స్వస్థలాలకు పంపామని మంత్రి మోపిదేవి తెలిపారు. దూరప్రాంతాల వారిని తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న ఆయన.. వీరిని తరలించేందుకు సీఎం సహాయనిధి నుంచి రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 3,838 మంది మత్స్యకారులు 65 బస్సుల్లో మంగళవారం రాత్రి బయల్దేరారని.. రేపు సాయంత్రానికి వారు స్వస్థలాలకు చేరుతారని మంత్రి చెప్పారు. అయితే వైద్య పరీక్షలు చేసిన అనంతరమే వారిని స్వస్థలాలకు పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కరోనా లక్షణాలు లేకుంటే వారిని ఇళ్లకు పంపనున్నట్లు మోపిదేవి స్పష్టం చేశారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కూలీలను స్వస్థలాలకు పంపుతామని మంత్రి వెల్లడించారు.

రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాం

రొయ్యలకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు చేయించినట్లు మంత్రి మోపిదేవి తెలిపారు. చేపలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు త్వరలో అధికారిక సమావేశం నిర్వహిస్తామన్న ఆయన.. ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

ఏపీకి రూ.550 కోట్లు ఇచ్చాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details