రాష్ట్రంలో 15వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా.. అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో అల్యూమినియం కాయిల్, పానెళ్ల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు.. ఆ సంస్థ సంసిద్దత వ్యక్తం చేసిందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. 200 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అలుబండ్ గ్లోబల్ పరిశ్రమకు 150 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి వివరించారు.
రూ.1500 కోట్ల పెట్టుబడులు.. యువతకు ఉద్యోగావకాశాలు: మేకపాటి - ap industries minister on investment in ap
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అబుదాబీలో పర్యటిస్తున్నారు. రూ.1500 కోట్లతో పెట్టుబడులు పెట్టేలా.. అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.
అబుదాబీలోని అల్మరోరాలో ఉన్న ముబదల కార్యాలయంలో కంపెనీ సీఈవోలతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. పారిశ్రామిక వసతులు, రిన్యువబుల్ ఎనర్జీ, విశాఖ మెట్రో ప్రాజెక్టు, పోర్టులలో పెట్టుబడులకు గల అవకాశాలపై ముబదల కంపెనీ సీఈవోతో చర్చించారు. అబుదాబీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధులతోనూ మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు, వాణిజ్యానికి గల అవకాశాలను.. వారికి వివరించారు. తబ్రీద్ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోవడంపై అబుదాబి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సంతోషం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తాం: కేంద్ర మంత్రి గడ్కరీ