ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడప స్టీల్ ప్లాంట్​ విషయంలో... ప్లాన్ 'బీ' అమలు చేస్తాం: గౌతమ్​రెడ్డి

లిబర్టీ స్టీల్​తో కలిసి కడప స్టీల్​ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పెండింగ్​లో పెట్టామని... రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. లిబర్టీ స్టీల్స్ కంపెనీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న మంత్రి... ఆ సంస్థకు నిధులు సమకూర్చే కంపెనీలు దివాళా తీశాయని వివరించారు. ఆ ప్రభావం లిబర్టీ స్టీల్స్ మీద పడిందని పేర్కొన్నారు.

గౌతమ్​రెడ్డి
గౌతమ్​రెడ్డి

By

Published : Mar 31, 2021, 3:42 PM IST

గౌతమ్​రెడ్డి

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో లిబర్టీ స్టీల్స్ ఆర్థిక పరిస్థితి సహకరించదని భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి వెల్లడించారు. ఎల్-2గా వచ్చిన కంపెనీని పరిగణనలోకి తీసుకోవాలా... ప్రభుత్వమే చేపట్టాలా.. అనే అంశంపై చర్చిస్తున్నామని వివరించారు. కడప స్టీల్​ప్లాంట్ విషయంలో ప్లాన్-బి అమలు చేస్తామని వెల్లడించారు.

ఏపీలోని పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు సుమారు రూ.1000 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.300 కోట్ల ప్రొత్సాహాకాలు అందించామని తెలిపారు. ఏప్రిల్ 2న ఐటీ వర్క్​షాప్ నిర్వహిస్తున్నామన్న మంత్రి... వివిధ సంస్థలకు చెందిన సీఈఓలు, సీఎఫ్ఓలు వర్క్​షాప్​లకు హాజరవుతారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details