ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పరిశ్రమల ఏర్పాటుకు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు' - పరిశ్రమల జోన్లపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కామెంట్స్

20 ఏళ్ల అభివృద్ధికి వచ్చే మూడేళ్లలో అనేక పనులు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మూడు ప్రధాన పోర్టులు నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్, ఆరెంజ్​, రెడ్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

By

Published : Aug 18, 2020, 11:01 PM IST

వచ్చే మూడేళ్లల్లో 20 ఏళ్ల అభివృద్ధికి సంబంధించిన పనులు చేపడుతున్నట్టు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుందని స్పష్టం చేశారు. త్వరలో రామాయపట్నం పోర్టు నిర్మాణం మొదలు పెడతామన్నారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం కూడా మరో 3-4 నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పోర్టుకు రూ.10 వేల కోట్లతో...3 మేజర్ పోర్టులు, దాదాపు రూ.2 వేల కోట్లు వెచ్చించి 7 ఫిషింగ్ హార్బర్లు, కారిడార్లు నిర్మిస్తున్నామన్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టామని వెబినార్ సమావేశంలో స్పష్టం చేశారు.

చేపల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతుల కోసం 7 హార్బర్ లను అధునాతనంగా నిర్మించనున్నట్టు వివరించారు. 45 వేల ఎకరాలలో శ్రీసిటీ తరహాలో సదుపాయాలుండే ఇండస్ట్రియల్ ఎస్టేట్​లను నిర్మిస్తామన్నారు. పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో వేగం కోసం రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్​లుగా విభజించనున్నామన్నారు. పరిపాలన సౌలభ్యం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి అవార్డునందుకున్న విశాఖ ఎయిర్ పోర్టు విస్తరణ పనులు డిసెంబర్​లో చేపడతామని తెలిపారు. తిరుపతి ఎయిర్ పోర్ట్ ను ఇంటర్నేషనల్ కార్గో హబ్​గా, కర్నూలు ఎయిర్ పోర్ట్ త్వరలోనే ఆన్ లైన్​లోకి వస్తుందన్నారు. కడప విమానాశ్రయం నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకురానున్నట్టు వివరించారు. విజయవాడ విమానాశ్రయాన్ని విస్తరించనున్నామని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొత్త విమానాశ్రయం నిర్మాణం చేపడతామని తెలిపారు.

ఇదీ చదవండి :ఇంట్లోని ట్రంకుపెట్టెల్లో బంగారం, వెండి నిల్వలు.. పోలీసుల సోదాలు

ABOUT THE AUTHOR

...view details