తెలంగాణ : బర్త్‌డే పార్టీలో మంత్రి మల్లన్న విన్యాసాలు... నెట్టింట వైరల్ - minister malla reddy birthday video viral
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సంబురాల్లో కాల్చిన టపాసులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
బర్త్‌డే పార్టీలో మంత్రి మల్లన్న విన్యాసాలు
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు(Minister malla reddy birthday) సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. అభిమానుల మధ్య మంత్రి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన టపాసులను మల్లారెడ్డి కాల్చారు. విల్లు ఆకారంలో ఉన్న టపాసులు ఈ సంబురాల్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.