ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆవో.. దేఖో.. సీఖో..' భాజపా సమావేశాలే లక్ష్యంగా తెరాస వ్యంగ్యాస్త్రాలు

ktr lettet to pm modi: మోదీజీ.. ఆవో-దేఖో-సీకో అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్​ తమదైన శైలిలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. తెలంగాణ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండని హితవు పలికారు. భాజపా కార్యవర్గ సమావేశాల్లో విద్వేషం, విభజన ఎజెండాపై చర్చ వద్దని.. అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడండని లేఖలో కోరారు.

TS Minister KTR
తెలంగాణ మంత్రి కేటీఆర్

By

Published : Jul 1, 2022, 8:14 PM IST

ktr lettet to pm modi: ప్రధాని మోదీకి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆవో - దేఖో - సీకో అంటూ తమదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీజీ.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండంటూ లేఖలో పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో విద్వేషం, విభజన ఎజెండాపై చర్చ వద్దని కేటీఆర్​ హితవు పలికారు. సమావేశాల్లో అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడండని కోరారు. భాజపా డీఎన్‌ఏలోనే విద్వేషం, సంకుచిత్వాన్ని నింపుకున్నారని విమర్శించారు.

సమావేశాల్లో ప్రజలకు పనికొచ్చే విషయాలు చర్చిస్తారనుకోవడం అత్యాశే అవుతుందని కేటీఆర్ అన్నారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మీరు మాట్లాడలేరని విమర్శించారు. భాజపా అసలైన అజెండా విద్వేషం.. సిద్ధాంతం విభజన అని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారన్న కేటీఆర్‌.. మోదీకి ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యముందని అనుకోవట్లేదన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-పరిపాలనను అధ్యయనం చేయండని ప్రధాని మోదీకి కేటీఆర్‌ సూచించారు. డబుల్ ఇంజిన్‌తో తాము ప్రజలకు ట్రబుల్‌గా మారారని ఆక్షేపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు అమలు చేయండని సూచించారు. తెలంగాణ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండని మోదీకి హితవు పలికారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details