KTR letter to center: పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ముడిచమురు ధరలు పెంచడమే కేంద్రం పనిగా పెట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు. భాజపా అసమర్థ విధానాలే ప్రస్తుత దుస్థితికి కారణమని మంత్రి దుయ్యబట్టారు. పన్నులు పెంచడమే పరిపాలనగా కేంద్రం భ్రమిస్తోందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలపై రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్ను భారం పడుతోందని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష పెట్రో పన్ను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దోపిడి కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా..?: కేటీఆర్ - మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
KTR letter to center: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూపోతున్న చమురు ధరల అంశంపై కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అసమర్థ విధానాల వల్ల ధరలు పెంచుతూ.. ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఒకవైపు కేంద్రం భారీగా పెట్రో ధరలు పెంచుతూ.. రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించాలంటూ వితండ వాదన చేస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ లక్ష్యంగా పెట్టుకునే పీఎం పెట్రో పన్ను యోజన పథకం తెచ్చారన్నారు. పెట్రో ధరల నియంత్రణలో విఫలమైనందుకు ప్రజలను ప్రధాని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే ప్రజలు తిరస్కరించడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఆగని వడ్డన.. ముంబయిలో రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు